తిరుమలలో కొత్త వీఐపీ బ్రేక్ దర్శనాలు... ఎల్లుండి నుంచి అమలు ?

Tirumala news | శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేయాలని నిర్ణయించిన టీటీడీ... ఎల్లుండి నుంచి 2012కు ముందు ఉన్న పాత విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

news18-telugu
Updated: July 15, 2019, 6:25 PM IST
తిరుమలలో కొత్త వీఐపీ బ్రేక్ దర్శనాలు... ఎల్లుండి నుంచి అమలు ?
జూన్‌ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.
  • Share this:
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కేటగిరీలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్న టీటీడీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలని భావిస్తున్నారు. రేపు ఈ బ్రేక్ దర్శనాల రద్దుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్లుండి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త విధానం అమలులోకి రానుంది. కొత్త విధానం ప్రకారం 2012 కంటే ముందున్న విధానాన్ని అమలు టీటీడీ అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.

2012 విధానం ప్రకారం వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరినీ కులశేఖర పడి వరకు అనుమతిస్తారు. పాత విధానం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని రెండు గంటలకు పరిమితం చేసే అవకాశం ఉందని... మరో గంటను సామాన్య భక్తుల దర్శనానికి కేటాయించవచ్చనే అభిప్రాయంతో టీటీడీ ఉంది. మొదట పూర్తిస్థాయి పాలకమండలి వచ్చిన దీనిపై నిర్ణయం తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భావించారు. అయితే కొత్త పాలకమండలి ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2019, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading