శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నానికి టోకెన్లు.. తిరుపతి, తిరుమలలో ఎక్కడ ఇస్తారంటే..

అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద ద‌ర్శ‌నం టోకెన్లు క‌లిగిన ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులకు ప్ర‌తి ఒక్క‌రికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ మ‌రియు శానిటైజెష‌న్ చేసిన అనంత‌రం మాత్ర‌మే తిరుమ‌ల దర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు.

news18-telugu
Updated: June 8, 2020, 9:14 PM IST
శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నానికి టోకెన్లు.. తిరుపతి, తిరుమలలో ఎక్కడ ఇస్తారంటే..
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 91 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
  • Share this:
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల దర్శనాలు మొదలైన విషయం తెలిసిందే. తిరుపతిలోనూ టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి భక్తులందరికీ అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో శ్రీవారి ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వనుంది టీటీడీ. మొత్తం 24 కౌంటర్ల ద్వారా ప్రతి రోజు 3వేల టికెట్లను మంజూరు చేయనున్నారు. దర్శనానికి ఒక రోజు ముందు.. ఈ టికెట్లను ఇస్తారు. పరిస్థితిని బట్టి టికెట్లను సంఖ్యను పెంచుతామని టీటీడీ అధికారులు ఇప్పటికే చెప్పారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు తిరుమ‌ల స్థానికుల‌కు జూన్ 10న శ్రీ‌వారి ద‌ర్శ‌నాని క‌ల్పించ‌నున్నారు. ఇందుకోసం జూన్ 9న తిరుమ‌ల‌లోని మూడు ప్రాంతాల‌లో టోకెన్లు జారీ చేయ‌నున్నారు. తిరుమ‌లలోని 12 కౌంట‌ర్ల‌ల‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 8.00 గంట‌ల నుండి ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు. ఈ కౌంట‌ర్ల‌లో చెరో 5 కౌంట‌ర్లు సిఆర్‌వో, కౌస్తుభంల‌లో, ఆర్‌టిసి బస్టాండ్‌లో రెండు కౌంట‌‌ర్ల‌లో 6 వేల ఉచిత టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11న ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10న తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 12 కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు. తిరుప‌తిలోని ఆర్‌టిసి బ‌స్టాండ్‌, విష్టునివాసం, అలిపిరి వ‌ద్ద‌గ‌ల భూదేవి కాంప్లెక్స్‌ల‌లో బుధ‌‌వారం ఉద‌యం 5.00 గంట‌ల నుండి ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు.

జూన్ 8, 9వ తేదీల‌లో ప్ర‌యోగ‌త్మ‌కంగా టిటిడి ఉద్యోగుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందుకోసం సోమ‌వారం ఉద‌యం నుండి టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీ కేంద్రాల‌ను ప‌లు మార్లు అధికారుల‌తో క‌లిసి త‌నిఖీలు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నానికి వ‌చ్చేఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ రూపొందించిన మార్కింగ్‌లో న‌డ‌వాలని సూచించారు. కాగా అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద ద‌ర్శ‌నం టోకెన్లు క‌లిగిన ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులకు ప్ర‌తి ఒక్క‌రికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ మ‌రియు శానిటైజెష‌న్ చేసిన అనంత‌రం మాత్ర‌మే తిరుమ‌ల దర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 8, 2020, 9:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading