11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం... ఈ రూల్స్ పాటించాల్సిందే

ఈ నెల 11 నుంచి తిరుమలలో సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ నెల 11 నుంచి తిరుమలలో సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

  • Share this:
    ఈ నెల 11 నుంచి తిరుమలలో సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజు ఎంతమందికి దర్శనాలు ఇవ్వాలనే దానిపై వర్కవుట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు దర్శనాలకు రావొద్దని... 65 ఏళ్లలోపు వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు దర్శనాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

    భక్తుల దర్శనానికి సంబంధించి 3 వేల మంది ఆన్‌లైన్‌లో, 3 వేల మందికి అలిపిరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో దర్శనానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తామని, 10వ తేదీన స్థానికులకు అనుమతి ఇస్తామని వివరించారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల పాటు ఉంటుందని అన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులను అనుమతిస్తామని... భద్రతా కారణాల వల్ల శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనాలు మొదలుకాగానే... ఇతర నగరాల్లో లడ్డూ విక్రయాలు నిలిపేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published: