కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.
ప్రతిరోజు 14 గంటలపాటు భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు ఐదు వందల మందికి మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
లాక్డౌన్ తరువాత పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే యోచనలో ఉన్న టీటీడీ... ఆ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ముందుగా ప్రయోగాత్మకంగా కొందరిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతిరోజు 14 గంటలపాటు భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు ఐదు వందల మందికి మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ... ఆ తరువాత 15 రోజుల పాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని భావిస్తోంది.
టీటీడీ తీసుకున్న నిర్ణయంతో రోజుకు 7 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్న టీటీడీ... టికెట్లు పొందిన భక్తులనే తిరుమలకు అనుమతించాలని యోచిస్తోంది. ఈ మేరకు అలిపిరి దగ్గర ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.