హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుమలలో తలనీలాలు సమర్పణలో ప్రస్తుతం ఇదీ పరిస్థితి..

తిరుమలలో తలనీలాలు సమర్పణలో ప్రస్తుతం ఇదీ పరిస్థితి..

తిరుమలలో పీపీఈ కిట్లు ధరించి గుండు గీస్తున్న క్షురకులు

తిరుమలలో పీపీఈ కిట్లు ధరించి గుండు గీస్తున్న క్షురకులు

Tirumala News | భక్తుల సౌకర్యార్ధం ఓ ప్రధాన కల్యాణకట్టతో పాటు మరో 10 ప్రాంతాల్లో మినీ కళ్యాణకట్టలను ఏర్పాటు చేసింది టీటీడీ.

  (ఎం. బాలకృష్ణ, సీనియర్ న్యూస్ కరస్పాండెంట్, న్యూస్‌18)

  కోవిడ్ 19 నేపథ్యంలో తిరుమలలోని కల్యాణకట్టలో టీటీడీ పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. ఇప్ప‌టికే భ‌క్తుల కోసం క్యూలైన్లులో ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన టీటీడీ ఇప్పుడు భక్తులు తలనీలాలు సమర్పించే చోట నివార‌ణ చ‌ర్య‌ల‌ను మ‌రింత ప‌టిష్టం చేసింది. క్షురకులు పీపీఈ కిట్లను ధరించి...చేతికి గ్లౌజులను వేసుకొని డిస్పోసబుల్ రేజర్లతో తలనీలాలు సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. మ‌రోవైపు శ్రీవారి దర్శనానికి తక్కువ సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ వుండడంతో గతంలోలా వేల సంఖ్యలో కాకుండా ప్రస్తుతం వందల సంఖ్యలోనే భక్తులు స్వామి వారికీ తలనీలాలు సమర్పిస్తున్నారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన భక్తులలో దాదాపు 30శాతం ముందికి పైగా భక్తులు తమ మొక్కు చెల్లింపులో భాగంగా శ్రీవారికీ తలనీలాలు సమర్పిస్తారు.

  తిరుమలలో పీపీఈ కిట్లు ధరించి గుండు గీస్తున్న క్షురకులు

  భక్తుల సౌకర్యార్ధం ఓ ప్రధాన కల్యాణకట్టతో పాటు మరో 10 ప్రాంతాల్లో మినీ కళ్యాణకట్టలను ఏర్పాటు చేసింది టీటీడీ. నిత్యం కూడా ఈ కల్యాణకట్టలలో దాదాపు 20 నుంచి 40 వేల మంది భక్తులు శ్రీవారికీ తలనీలాలు సమర్పిస్తుంటారు. స్వామి వారికీ తలనీలాలు సమర్పించిన తదనంతరం భక్తులు స్వామి వారిని దర్శిoచుకోవడం తిరుమలలోని సాంప్రదాయం.

  తిరుమలలో కల్యాణకట్ట వద్ద పీపీఈ కిట్లు ధరించి భక్తులను పరిశీలిస్తున్న సిబ్బంది

  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా...ఈ మహమ్మారి తిరుమలలో ప్రబలకుండా కేంద్రం కంటే ముందే లాక్ డౌన్ ను ప్రకటించింది టీటీడీ. దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసిన టీటీడీ. లాక్ డౌన్ 5.0లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఈ నెల 8వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు తిరుమల శ్రీవారి దర్శనం విధి విధానాలలో భారీ మార్పులను చేసింది. గతంలో శ్రీవారిని 60వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకుంటావుంటే ప్రస్తుతం కేంద్రం నిబంధనలు ప్రకారం ఖచ్చితంగా భక్తులు భౌతిక దూరం పాటించాల్సి వుండడంతో స్వామి వారిని ప్రతి నిత్యం దర్శించుకునే భక్తుల సంఖ్యను 10వేలకు కుదించింది. దీంతో ప్రతి నిత్యం స్వల్ప సంఖ్యలోనే స్వామి వారి దర్శనార్ధం భక్తులు తిరుమలకు వస్తావుండడంతో శ్రీవారికీ తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

  ఒకప్పుడు కిటకిటలాడిన కల్యాణ కట్ట ఇప్పుడు భక్తుల లేక బోసిపోతోంది

  ప్రస్తుతం కేవలం 1500 నుంచి రెండున్నర వేల మంది భక్తులే స్వామి వారికీ తలనీలాలు సమర్పిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తలనీలాలు తీసే సమయంలో ఈ వైరస్ ప్రభలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుండడంతో టీటీడీ ప్రస్తుతం ప్రధాన కళ్యాణకట్టతో పాటు పద్మావతి అతిధి గృహం ప్రాంతంలోని కల్యాణకట్టను మాత్రమే భక్తులకు అందుబాటులో వుంచింది.

  తిరుమల ఆలయ గోపురానికి నమస్కరిస్తున్న యువతి

  ఇక్కడ కూడా క్షురకులు భౌతిక దూరం పాటిస్తూ పీపీఈ కిట్లను ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకొని తలనీలాలు సేకరిస్తున్నారు. భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా చాలా పకడ్బందీగా టీటీడీ చర్యలు తీసుకోవడంతో భక్తులకు కూడా గతంలో వల్లే ప్రస్తుతం ఎటువంటి ఆందోళన లేకుండా శ్రీవారికీ తలనీలాలు సమర్పిస్తున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే వరకు కూడా కల్యాణకట్ట వద్ద కూడా తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య చాలా తక్కువుగానే వుండే అవకాశం కనిపిస్తోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు