హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం..

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయం కంటే భక్తులు మనోభావాలు ముఖ్యమని, అందులో భాగంగానే ఇక నుంచి ఎస్వీబీసీ ఛానెల్‌ను యాడ్ ఫ్రీ ఛానెల్‌గా ప్రసారం కానున్నట్టు టీటీడీ యాజమాన్యం తెలిపింది.

  తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం కంటే భక్తులు మనోభావాలు ముఖ్యమని, అందులో భాగంగానే ఇక నుంచి ఎస్వీబీసీ ఛానెల్‌ను యాడ్ ఫ్రీ ఛానెల్‌గా ప్రసారం కానున్నట్టు టీటీడీ యాజమాన్యం తెలిపింది. అయితే ఇదే క్రమంలో యాడ్ ఫ్రీ ఛానెల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని పేర్కొంది. దీనికితోడు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలను భక్తులకు అందించేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతామని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తామని టీటీడీ వెల్లడించింది. ఇప్పటికే రూ.25 లక్షలు ఎస్వీబీసీ ఛానెల్‌కు భక్తులు విరాళంగా అందించారు.

  ఇదిలావుంటే.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనాలు దాదాపు 80 రోజుల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 11 నుంచే భక్తులకు ఆన్‌లైన్ టికెట్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

  Published by:Anil
  First published:

  Tags: Svbc, Tirumala news, Ttd

  ఉత్తమ కథలు