తిరుమల శ్రీవారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మారింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవా టికెట్లు ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్పు చేశారు. భక్తులు ఈ మార్పును గమనించవలసినదిగా మనవి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది.
మరోవైపు కరోనా లాక్ డౌన్ కాలంలో కూడా తిరుమల శ్రీవారికి ఈ - హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఈ-హుండీ ద్వారా ఏప్రిల్ నెలలో 1.97 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.79 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి అంతకు మించి విరాళాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.50 లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మంటపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని.. ప్రత్యేక ఆర్డర్‌పైనా స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని అధికారులు చెప్పారు. మరింత సమాచారం కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ (9849575952), పేష్కార్ శ్రీనివాస్ (9701092777)ను సంప్రదించాలని ఆయన సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam