మనవసేవే మాధవ సేవ అంటూ నినదించడమే కాదు.... ఆ సూక్తిని ఎప్పటి నుంచో ఆచరిస్తూ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు సమర్పించే కానుకల ద్వారా..టీటీడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. మరెంతో మంది అభ్యున్నతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. దోహద పడుతోంది. వెంకన్న భక్తుల కానుకలను.. కేవలం ధార్మిక కార్యక్రమాలకే కాకుండా.. దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తూ.. వారి జీవితాల్లో సువర్ణ కాంతులు నింపుతోంది. తమకు పుట్టుకతో లోపం మాత్రమే ఉందని.... కానీ శ్రీవారి అనుగ్రహంతో....టీటీడీ అధికారుల సహకారంతో.. ఆ లోపాన్ని జయించి.. తమ కాళ్లపై తాము నిలబడగలమని ఆ ప్రత్యేక ప్రతిభావంతులు రుజువు చేస్తున్నారు .
Shivaratri Buses: శివభక్తులకు శుభవార్త.. ఈ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
శ్రీవారి పాదాల చెంత.. అలిపిరి కూడలికి ఆనుకోని.. ప్రత్యేక ప్రతిభావంతుల కోసం మూడు విద్యా సంస్థలను నిర్వహిస్తోంది టీటీడీ. ముగ చెవిటి వారి కోసం ఈ పాఠశాలలో ప్రత్యేల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యలో టీటీడీ డీఈవో పర్యవేక్షణలో ఈ విద్య సంస్థలు నడుస్తున్నాయి. 1974లో బధిరుల ఉన్నత పాఠశాలను ఇక్కడ టీటీడీ ఏర్పాటు చేసింది. 2008లో బధిరుల జూనియర్ కళాశాలను ప్రారంభించింది. అంతేకాదు ప్రత్యేక ప్రతిభావంతుల కోసం 1983 నుంచి శ్రీ వెంకటేశ్వర దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రత్యేక ప్రతిభావంతులు మనోస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. బధిరుల ఉన్నత పాఠశాల 2024లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను చేసుకోనుంది. ఇక్కడ ముగ చెవిటి పిల్లలకు విద్య బోధనలు చేస్తుంటారు. వారికి అర్థం అయ్యేలా సైన్ భాషను ఉపయోగించి.. పాఠాలను నేర్పిస్తారు. కేవలం చదువు మాత్రమ కాదు.. వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించేలా.. శిక్షణ ఇస్తున్నారు.
ఈ స్కూల్‌లో 350 మందికి పైగా పిల్లలు విద్యను అభ్యసిసిస్తున్నారు. 8వ తరగతి నుంచి టైలరింగ్, పెయింటింగ్ వంటి అంశాలపై నైపుణ్యం వచ్చేలా తీర్చి దిద్దుతున్నారు. ఆడియాలజి, స్పీచ్ పెథాలోజి ల్యాబ్ సైతం టీటీడీ నిర్వహిస్తోంది. పదాలను, వాటి అర్థాలను నేర్చుకొని.. మాట్లాడేందుకు ప్రయత్నించే విధంగా ఇక్కడ బోధనలు చేస్తారు. తిరిగి పదాలను పలికేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకటవ తరగతి ముంచి 10వ తరగతి వరకు కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం విద్యార్థులకు జూనియర్ కళాశాల నందు హెచ్ఈసి, సీఈసి కోర్సులకి ప్రవేశం కల్పిస్తారు.
ఇక ఎస్వీ ట్రైనింగ్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేల కోర్సులను తీసుకొచ్చారు. జీవనోపాధి ఎంచుకొనేలా ఒకేషనల్ కోర్సులు సైతం ప్రవేశ పెట్టారు. టైలరింగ్, పనిముట్లు తయారీ ప్రక్రియ, ఆర్ట్, వెల్డింగ్ వంటి పనులను నేర్పిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన విద్యార్థుల్లో ఎంతో మంది స్థిరపడ్డారు. వారి జీవితాల్లో వెలుగులు చూడడమే తమ లక్ష్యమని.. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా.. పాఠాలు నేర్పుతున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Local News, Tirumala, Tirupati