తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ పున:ప్రారంభం.. రోజుకు ఎన్ని టోకెన్లు ఇస్తున్నారంటే..?

తిరుమల ఆలయం(ఫైల్ ఫొటో)

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పున: ప్రారంభించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి టీటీడీ సర్వదర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించింది.

  • Share this:
    తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పున: ప్రారంభించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి టీటీడీ సర్వదర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని జారీచేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరసటి రోజు ఉదయం దర్శనం కల్పించనున్నారు. రోజుకు 3వేల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తెల్లవారుజామునుంచే కౌంటర్‌ల వద్ద బారులు తీరారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి పర్మిషన్ ఇవ్వనున్నారు.

    ఇక, కరోనా లాక్‌డౌన్ అనంతరం జూన్ 11న భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ.. సర్వదర్శనం టోకెన్లు జారీచేసింది. అయితే తిరుపతిలో కరోనా విజృంభణతో సెప్టెంబర్ 6న సర్వదర్శనం టికెట్లను టీటీడీ నిలిపివేసింది. తాజాగా పరిస్థితుల్లో మార్పు రావడంతో.. భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీచేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు నెలన్నర తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం విజయదశమి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: