Tirumala: కాటేజీ డొనేషన్ స్కీం కింద రూ.69 కోట్లు పొందిన టీటీడీ

గజవాహనంపై తిరుమల శ్రీవారు

తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల‌లోని అతిథి భ‌వ‌నాల‌ను కాటేజి డోనే‌ష‌న్ స్కీమ్‌ కింద టెండ‌ర్లు దాఖ‌లు చేసిన దాత‌ల‌కు కేటాయింపు ఖ‌రారు అయింది.

 • Share this:
  Tirumala Tirupati Devasthanam: తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల‌లోని అతిథి భ‌వ‌నాల‌ను కాటేజి డోనే‌ష‌న్ స్కీమ్‌ కింద టెండ‌ర్లు దాఖ‌లు చేసిన దాత‌ల‌కు కేటాయింపు ఖ‌రారు అయింది. గ‌తంలో అతిథి భ‌వ‌నాలు నిర్మించిన దాత‌లకు నిర్థారించిన‌ కాల ప‌రిమితి ముగియ‌డంతో టీటీడీ టెండ‌ర్లు ఆహ్వానించింది.

  శ్రీ‌ప‌తి విశ్రాంతి భ‌వ‌నం రూ. 7.11 కోట్ల‌తో ( 7 కోట్ల 11 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన ఫోనిక్స్ ప‌వ‌ర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌,

  విద్యాస‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌నం రూ. 7.89 కోట్ల‌తో ( 7 కోట్ల 89 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన జూప‌ల్లి శ్వామ్‌రావు,

  స్నేహ‌ల‌త విశ్రాంతి భ‌వ‌నం రూ. 7.87 కోట్లతో ( 7 కోట్ల 87 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన పిచ‌మ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్,

  కార‌మ్ నివాస్  విశ్రాంతి భ‌వ‌న‌ం రూ. 6.8 కోట్ల‌తో ( 6 కోట్ల 80 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన భూదాతి ల‌క్ష్మీ నారాయ‌ణ,

  వ‌కుళా విశ్రాంతి భ‌వ‌న‌ం రూ. 6.5 కోట్ల‌తో ( 6 కోట్ల 50 ల‌క్ష‌లు) ముంబైకి చెందిన రాజేష్ శ‌ర్మ .

  గంబెల్ విశ్రాంతి భ‌వ‌న‌ం రూ.5.99 కోట్ల‌తో ( 5 కోట్ల 99 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన ఎస్‌.భాగ్య‌శ్రీ

  శ్రీ‌నికిత‌న్‌ విశ్రాంతి భ‌వ‌నం రూ. 5.98 కోట్ల‌తో ( 5 కోట్ల 98 ల‌క్ష‌లు 50 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన శ‌ర‌త్ చంద్ర రెడ్డి,

  గోదావ‌రి విశ్రాంతి భ‌వ‌న‌ం రూ. 5.5 కోట్ల‌తో ( 5 కోట్ల 50 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌,

  ల‌క్ష్మీ నిల‌యం విశ్రాంతి భ‌వ‌న‌ం రూ. 5.25 కోట్లతో ( 5 కోట్ల 25 ల‌క్ష‌లు) ముంబైకి చెందిన అఫ్‌కాన్స్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్,

  బాలాజి కుటీర్ వి‌శ్రాంతి భ‌వ‌న‌ం రూ. 5 కోట్ల‌తో ( 5 కోట్ల 11 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన ఓం ప్ర‌కాష్ అగ‌ర్వాల్ ,

  శాంతి స‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌ం రూ. 5 కోట్ల‌తో బెంగుళూరుకు చెందిన ఎమ్‌.ఎస్‌.ర‌క్ష‌రామ‌య్య‌, ఎమ్‌.ఎస్‌. సుంద‌ర్ రామ్‌‌ల‌కు అధికారులు టెండ‌ర్లు ఖ‌‌‌‌రారు చేశారు.

  మరోవైపు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. మాడవీధుల్లో యథావిధిగా వాహన సేవల ఊరేగింపు నిర్వహిస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహన సేవ జరిగే మాడవీధుల్లోని గ్యాలరీలలో థర్మల్‌ స్క్రీనింగ్‌, ఆపరేటెడ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు కళ్యాణవేదిక దగ్గర పుష్ప ప్రదర్శన, ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది అధికమాసం వచ్చినందున తిరుమలలో వెంటవెంటనే రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి వచ్చింది. కిందటి నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ నెలలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను చేపట్టడానికి సన్నాహాలు కొనసాగిస్తున్నారు. 15వ తేదీన అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 16వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి.

  తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల దర్శనాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవ రోజుల్లో దర్శనాల సంఖ్యను 20వేల వరకు పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేవలం దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే నవరాత్రులు సందర్భంగా తిరుమలకు అనుమతి కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: