తిరుమల భక్తులకు శుభవార్త... 10రోజులపాటు వైకుంఠ దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం గుండా వెళ్లి దర్శంచుకునే వీలుంది.

  • Share this:
    తిరుమల స్వామివారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారిని వైకుంఠద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అనేకమంది భక్తులు తాపత్రయపడుతుంటారు. ఆరోజున ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం గుండా వెళ్లి దర్శంచుకునే వీలుంది. ఆరోజున లక్షల్లో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. దీంతో రద్దీ వల్ల అది అందరికి ఆ దర్శన భాక్యం దొరకదు. దీంతో ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకునే ప్రతిపాదనలు టీటీడీ సిద్దం చేస్తోంది.

    దీనికి టీటీడీ ఆగమ సలహామండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇంకా పాలకమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందకు టీటీడీ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు తిరుమల అధికారులు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో 10 రోజులపాటు ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యలు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతామన్నారు టీటీడీ అధికారులు.
    Published by:Sulthana Begum Shaik
    First published: