తిరుమలలో రథ సప్తమి వేడుకలు : సప్త వాహనాలపై ఊరేగనున్న శ్రీవారు..

సూర్యకిరణాలు మలయప్పస్వామిని తాకగానే అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వాహనం ఊరేగింపు సేవ మొదలవుతుంది.

news18-telugu
Updated: February 12, 2019, 1:59 PM IST
తిరుమలలో రథ సప్తమి వేడుకలు : సప్త వాహనాలపై ఊరేగనున్న శ్రీవారు..
విద్యుత్ కాంతుల్లో తిరుమల..(File)
news18-telugu
Updated: February 12, 2019, 1:59 PM IST
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం వేకువ జామున రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం ఆలయాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఉదయం 4గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో వేడుకలు మొదలయ్యాయి.

వాహన మండపం నుంచి సూర్యప్రభలో ఆశీనులై 5.30గంటలకు స్వామి ఊరేగింపునకు బయలుదేరుతారు. నాలుగు మాడవీధుల్లో ప్రదక్షిణగా పడమర, ఉత్తర దిశలు కలిసే మూలలోకి వేంచేసి తూర్పుదిక్కుగా నిలబడతారు. సూర్యకిరణాలు మలయప్పస్వామిని తాకగానే అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వాహనం ఊరేగింపు సేవ మొదలవుతుంది.

ఉదయం 5.30 కు సూర్యప్రభ వాహనంపై ఊరేగే స్వామి వారు.. ఆపై 9 గంటలకు చిన్న శేషవాహనం, 11 గంటలకు గరుడవాహనం, మధ్యాహ్నం 1 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4గంటలకు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగనున్నారు.


అటు అరసవల్లి సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలోనూ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో మూల విరాట్‌కు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు అర్చకులు, వేద పండితులు ఈ సేవను నిర్వహించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...