వెంకన్న భక్తులకు శుభవార్త.. ఇకపై రోజూ అన్ని వేల మందికి దర్శనాలు

ప్రతీకాత్మక చిత్రం

అదనపు టికెట్లతో కలిపి ఇప్పటివరకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల సంఖ్య 13 వేలకు చేరుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.

  • Share this:
    లాక్‌డౌన్ సడలింపులు తరువాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న టీటీడీ.. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తోంది. పరిస్థితిని బట్టి దర్శనాలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచాలని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. తాజాగా దర్శనం టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిత్యం అదనంగా మరో 3 వేల టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతిరోజూ అదనంగా కేటాయించనున్న 3 వేల టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.

    అదనపు టికెట్లతో కలిపి ఇప్పటివరకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల సంఖ్య 13 వేలకు చేరుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొంటున్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి సేవ చేసుకున్న 90 రోజుల్లో ఎప్పుడైనా భక్తులు దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని పోస్టల్‌ ద్వారానే పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. ఇక త్వరలో జరగబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్వహించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: