TTD : తిరుమల భక్తులకు శుభవార్త... ఇక పెద్ద లడ్డూలు...

TTD ( Tirumala Tirupati Devasthanam ) : ఇప్పటివరకూ తిరుమలలో రూ.50ల లడ్డూని మాత్రమే అందరికీ ఇస్తున్నారు. ఇకపై కల్యాణం లడ్డూలను కూడా అందరికీ అమ్మబోతున్నారు.


Updated: February 13, 2020, 5:30 AM IST
TTD : తిరుమల భక్తులకు శుభవార్త... ఇక పెద్ద లడ్డూలు...
తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కోసం ఇప్పుడు తిరుమలకు వెళ్లాల్సిన పనిలేదు. టీటీడీయే భక్తుల చెంతకు లడ్డూ చేరువయ్యేలా ఎన్నో మార్పులు చేసింది. తాజాగా... హైదరాబాద్... హిమాయత్‌నగర్‌లోని బాలాజీ భవన్‌లో ఇవాళ్టి నుంచి లడ్డూలు అమ్ముతున్నారు. మొదటిరోజు 10 వేల లడ్డూలు అమ్మాలని నిర్ణయించారు. ఇదే గుడ్ న్యూస్ అనుకుంటే... లడ్డూ ధరను రూ.50 నుంచి 25 రూపాయలకు తగ్గించారు. ఇది మరో గుడ్ న్యూస్. ఇక కరోనా రూల్స్ ప్రకారం లడ్డూల కోసం వచ్చే భక్తులు మాస్కులు ధరించాలి. దూరం దూరం పాటించాలని మనకు తెలుసు. (credit - twitter)
  • Share this:
TTD ( Tirumala Tirupati Devasthanam ) : తిరుమల లడ్డూ అంటే అందరికీ ఇష్టమే. రోజూ తిన్నా ఇంకా తినాలనిపించే రుచికి తోడు భక్తి భావం కూడా ఆ లడ్డూ సొంతం. అలాంటి లడ్డూలను ఎన్నైనా తీసుకోవడానికి వెనకాడరు భక్తులు. ఐతే... ఇప్పటివరకూ తిరుమలలో చిన్నగా ఉండే రూ.50 లడ్డూలను మాత్రమే ఎన్ని కావాలంటే అన్ని అమ్ముతున్నారు. ఒకసారి క్యూలో నిలబడితే 10 లడ్డూల దాకా ఇస్తున్నారు. అవి ఒక్కో లడ్డూ 160 గ్రాముల నుంచీ 180 గ్రాముల దాకా బరువు ఉంటాయి. ఐతే... చాలా మంది కల్యాణం లడ్డూ కావాలని అడుగుతుండటంతో... టీటీడీ ఆ దిశగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. కళ్యాణం లడ్డూ చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద లడ్డూని భక్తలకు ఏ ధరకు అమ్మాలో నిర్ణయించిన టీటీడీ... ఒక్కో లడ్డూనీ రూ.200కి అమ్మాలని ఫిక్సైంది. బుధవారం సాయంత్రం నుంచీ ఈ పెద్ద లడ్డూల అమ్మకాలు మొదలయ్యాయి.

సాధారణంగా పెద్ద లడ్డూలను వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఉచితంగా ఇస్తుంటారు. ఐతే ఇటీవల లడ్డూల విషయంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదివరకు కాలి నడకన వచ్చే భక్తులకు... రూ.70కే నాలుగు చిన్న లడ్డూలు ఇచ్చిన టీటీడీ ఇప్పుడు ఆ రూల్ తీసేసి... ఒకటే లడ్డూ రూ.50లది ఫ్రీగా ఇస్తున్నారు. చిన్న లడ్డూల విషయంలో ఈ మార్పు చేసిన టీటీడీ... పెద్ద లడ్డూల విషయంలో కూడా ఇకపై ఫ్రీగా ఇవ్వకూడదని డిసైడైంది. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు కూడా ఒక చిన్న ఉచిత లడ్డూ (రూ.50లది) ఇస్తూ, పెద్ద లడ్డూ కావాలంటే ఒక్కొక్కటి రూ.200కు కొనుక్కోవాలని సూచించింది. టీటీడీ అలా చెప్పిందో లేదో... పెద్ద ఎత్తున పెద్ద లడ్డూల కోసం భక్తులు ఆసక్తి చూపించారు.

ఇప్పుడు తిరుమలకు వెళ్లే ఎవరైనా సరే... పెద్ద లడ్డూలను ఒక్కొక్కటీ రూ.200 పెట్టి కొనుక్కోవచ్చు. ఇందుకోసం ఎలాంటి సిఫార్సు లేఖలూ అవసరం లేదు. తిరుమలలోని లడ్డూ విక్రయ శాలలో రెండు ప్రత్యేక కౌంటర్లను పెద్ద లడ్డూల కోసం ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో లడ్డూల కోసం డబ్బులు ఇచ్చి... బిల్లు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్‌ను ఫస్ట్ ఫ్లోర్‌లో ఇస్తే... లడ్డూలు ఇస్తారు. ఐతే... లడ్డూలతోపాటూ... ఎలాంటి సంచులూ, క్యారీబ్యాగ్‌లూ ఇవ్వరు. అవి కావాలంటే... గ్రౌండ్ ఫ్లోర్‌లో విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కో క్యారీబ్యాగ్‌ను రూ.3కి ఇస్తున్నారు. 3 కావాలంటే రూ.10కి ఇస్తున్నారు. ఒక్కో క్యారీ బ్యాగ్‌లో చిన్న లడ్డూలు 20 దాకా పడతాయి. పెద్దవైతే... 5 దాకా పడతాయి.
Published by: Krishna Kumar N
First published: February 13, 2020, 5:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading