హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కరోనా ఎఫెక్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం..

కరోనా ఎఫెక్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తిరుమలకు వచ్చే భక్తులందరి నమూనాలను సేకరించడంతో పాటు బస్సుల్లో కొండమీదకు వచ్చే ప్రయాణికులకు టికెట్‌తో పాటు ఓ చీటిని సైతం అందిస్తోంది.

  తెలుగు రాష్ట్రాల్లో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమలు సమయంలో పాజిటివ్ కేసులు నియంత్రణలోనే ఉన్నాయి. కానీ లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులందరి నమూనాలను సేకరించడంతో పాటు బస్సుల్లో కొండమీదకు వచ్చే ప్రయాణికులకు టికెట్‌తో పాటు ఓ చీటిని సైతం అందిస్తోంది. అందులో తిరుమలకు వచ్చే చిరునామా, మొబైల్ నంబర్, బస్సు నంబరు, సమయం రాయాల్సి ఉంటుంది. అలా భక్తులు రాసిన చీటీలను అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఆర్టీసీ సిబ్బంది సేకరిస్తారు. దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టడం సులువవుతుంది.

  ఒక వేళ బస్సుల్లో ప్రయాణించిన భక్తులకు ఎవరికైనా వైరస్ సోకిందని తేలితే.. అతడితో పాటు ప్రయాణించిన వారిని సులువుగా గుర్తించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట్నుంచి కరోనా వైరస్ నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అందులో భాగంగానే రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు చికిత్సను ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

  Published by:Anil
  First published:

  Tags: Corona virus, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు