TTD ఆస్తుల వేలం నిలిపివేత.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో వెల్లడించింది. సంప్రదింపులు పూర్తయ్యే వరకు భూముల విక్రయ ప్రక్రియను నిలిపిివేస్తున్నట్లు తెలిపింది.

  • Share this:
    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలిపివేసింది. నాడు చేసిన తీర్మానంలో తిరుమల శ్రీవారికి చెందిన 50 భూములను విక్రయించాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని తాజాగా నిలిపివేసింది ఏపీ సర్కార్. భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో వెల్లడించింది. సంప్రదింపులు పూర్తయ్యే వరకు భూముల విక్రయ ప్రక్రియను నిలిపిివేస్తున్నట్లు తెలిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీకి సూచించింది ఏపీ ప్రభుత్వం. ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది.

    జీవో కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    కాగా, తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఏపీ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. పలు రాజకీయ పార్టీలతో పాటు సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్తుల వేలం వ్యవహారంపై సోమవారం సాయంత్రం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆస్తులను వేలం వేయాలన్న నిర్ణయం పాత బోర్డే తీసుకుందని.. దానిపై తాము సమీక్ష మాత్రమే చేస్తున్నామని చెప్పారు. రిపోర్టు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. దీనిపై రాజకీయాలు చేయడం తగదని విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే టీటీడీ ఆస్తుల వేలాన్ని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం.
    Published by:Shiva Kumar Addula
    First published: