శ్రీవారి ఆస్తులపై కీలక నిర్ణయం.. ఆ పని చేయనున్న టీటీడీ..

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ అనంతరం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్లు అదనంగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

  • Share this:
    శ్రీవారి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆస్తులపై ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాలు నెలకొంటున్న నేపథ్యంలో టీటీడీ నిర్ణయం కీలకంగా మారనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆస్తులన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. తొలిసారిగా తిరుపతిలోని టీటీడీ అడ్మనిస్ట్రేషన్ భవనంలో డయల్ యూవర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వివాదాలకు తావు లేకుండా పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇదిలావుంటే.. తిరుమలకు వచ్చిన 631 భక్తుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఏ ఒక్కరికీ పాజిటివ్ రాలేదని తెలిపారు. అలిపిరి వద్ద 1704 మంది టీటీడీ ఉద్యోగులకు, తిరుమలలో 1865 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో 91 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు తేలిందని చెప్పారు.

    లాక్‌డౌన్ అనంతరం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్లు అదనంగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల కోసం టెండర్లు నిర్వహిస్తున్నామని, అప్పటి పరిస్థితులను బట్టి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీటీడీకి సెప్టెంబరు నెల వరకు టీటీడీకి ఏలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని చెప్పారు. టికెట్ బుక్ చేసుకున్న భక్తుల్లో 30 శాతం మంది తిరుమల యాత్రను రద్దు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published: