హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD : తిరుమలకు భారీగా భక్తులు... జూన్ 26 వరకూ టోకెన్లు జారీ...

TTD : తిరుమలకు భారీగా భక్తులు... జూన్ 26 వరకూ టోకెన్లు జారీ...

తిరుమలకు భారీగా భక్తులు... జూన్ 26 వరకూ టోకెన్లు జారీ...

తిరుమలకు భారీగా భక్తులు... జూన్ 26 వరకూ టోకెన్లు జారీ...

Tirumala News : తిరుమలను తిరిగి ప్రారంభించాక... భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

  Tirumala Updates : కరోనా కాలంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ... తిరుమల స్వామి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. అందువల్ల టీటీడీ పాలక మండలి తన రూల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు... తిరుమలకు వచ్చే భక్తులకు... సర్వ దర్శనం టోకెన్లను... ముందు రోజు మాత్రమే ఇస్తామని చెప్పిన టీటీడీ... టోకెన్ల క్యూలైన్లు భారీగా ఉండటంతో... రూల్ పక్కన పెట్టి... ఒక్కసారిగా టోకెన్ల పంపిణీ పెంచింది. దాంతో... జూన్ 26 వరకూ... టోకెన్లు ఇచ్చేసింది. కాబట్టి... 26వ తేదీ వరకూ భక్తులు తమ తమ టోకెన్లలో ఉన్న తేదీ, టైమ్ స్లాట్ ప్రకారం కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

  కోవిడ్ -19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఐతే... ప్రస్తుతం టీటీడీ... రోజుకు... 8 వేల మందిని దర్శనానికి అనుమతిస్తోంది. భక్తులంతా... క్యూ పద్ధతి పాటిస్తూ... సోషల్ డిస్టాన్స్‌లో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అందువల్ల గర్భాలయం దగ్గర మూలవిరాట్టును తనివితీరా చూసేందుకు వీలు కలుగుతోంది. అందువల్లే ఇప్పుడు స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని తెలుస్తోంది.

  21వ తేదీన సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు వేకువజామున నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఆ తర్వాత సంప్రోక్షణ జరిపి మధ్యాహ్నం 2.30 తరువాత భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ 19 రూల్స్ అమలుచేస్తున్నామన్నారు. దేశంలోని కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వారిని దర్శనానికి అనుమతించట్లేదు. అలాగే పిల్లలు, ముసలివారిని కూడా దర్శనానికి రావొద్దని సూచిస్తున్నారు.

  27వ తేదీ నుంచి దర్శనాలకు సంబంధించి టోకెన్లు ఎప్పుడు ఇచ్చేదీ... పాలకమండలి సమీక్షా సమావేశంలో నిర్ణయించనున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Tirumala news, Tirupati, Ttd

  ఉత్తమ కథలు