తిరుమలలో పెరిగిన అద్దె ధరలు.. నేటి నుంచి అమలులోకి..

తిరుమలలో పెరిగిన అద్దె ధరలు.. నేటి నుంచి అమలులోకి..

తిరుమల తిరుపతి దేవస్థానం

కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. ఇంతకుముందు తిరుమలలో కనీస వసతి రూ.50కి లభించేది.

  • Share this:
    తిరుమలలో అద్దె గదుల ధరలను పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇదివరకు రూ.600గా ఉన్న నందకం అద్దె గదులు ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. ఇంతకుముందు తిరుమలలో కనీస వసతి రూ.50కి లభించేది. తాజాగా పెరిగిన ధరలతో అది రూ.100కి చేరింది. రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతిగా పరిగణిస్తారు. రూ.999, రూ.1500లకు లభించే గదుల్లో ఏసీ వంటి సదుపాయాలను కల్పించనున్నారు. అయితే తిరుమలలో పెంచిన వసతి గదుల ధరలు తిరుపతిలో మాత్రం పెంచలేదు. తిరుపతిలో ఎప్పటిలాగే రూ.100,రూ.200, రూ.300, రూ.400, రూ.600, రూ.800, రూ.1000కు గదులు లభ్యమవుతాయి.
    Published by:Srinivas Mittapalli
    First published: