తిరుమలలో గదుల అద్దెలు పెరిగాయ్... ఇవే కొత్త ధరలు..

తిరుమలలో గదుల అద్దెలు పెరిగాయ్... ఇవే కొత్త ధరలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి దర్శనం కోసం వెళ్లే వారు ఏసీ గదుల్లో దిగాలనుకుంటే కొంచెం ఖర్చు పెట్టుకోవాలి.

  • Share this:
    తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముఖ్యగమనిక. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే వారు ఏసీ గదుల్లో దిగాలనుకుంటే కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే గదుల అద్దెలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణ గదుల అద్దెలు పెంచకుండా కేవలం ఏసీ విశ్రాంతి గృహాల అద్దెలను మాత్రమే టీటీడీ పెంచింది. న‌వంబ‌రు 12, 26న వృద్ధులు, దివ్యాంగులకు, న‌వంబ‌రు 13, 27వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనున్నట్టు టీటీడీ తెలిపింది. వయోవృద్ధులు(65 సంవత్సరాల పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

    5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను న‌వంబ‌రు 13, 27వ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు.

    కొత్తగా పెంచిన ధరల వివరాలు

    • నందకం విశ్రాంతి గృహం - రూ.600 నుంచి రూ.1000కి పెంపు

    • కౌస్తుభం, పాంచజన్యం విశ్రాంతి గృహాలు - రూ.500 నుంచి రూ.100కి పెంపు

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు