news18-telugu
Updated: July 30, 2020, 8:48 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ రోజురోజూకీ పెరుగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు టీటీడీ ఆలయ చరిత్రలోనే ఏన్నడూ లేనివిధంగా భక్తుల దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో తిరిగి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. అయితే దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నా.. శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా బ్రేక్ టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో బ్రేక్ టికెట్లు పొందిన కొంతమంది భక్తులు తమ దర్శనం కాలపరిమితిని పొడగించాలంటూ టీటీడీని విజ్ఞప్తి చేశారు.
దీంతో స్పందించిన టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేలు చెల్లించి టికెట్లు పొందిన దర్శన కాలాన్ని ప్రస్తుతం ఉన్న ఆరునెలల కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏడాదిలోపు ఈ టికెట్లను వినియోగించుకోవాలని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Published by:
Narsimha Badhini
First published:
July 30, 2020, 8:48 PM IST