శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిలీజ్... రికార్డులు తిరగరాస్తున్న హుండీ ఆదాయం

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. పెద్ద పెద్ద కానుకలు సమర్పించే భక్తులు కూడా పెరిగారు. ఫలితంగా ఆదాయం అంతకంతకూ దూసుకెళ్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 11:01 AM IST
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిలీజ్... రికార్డులు తిరగరాస్తున్న హుండీ ఆదాయం
గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్‌ చేస్తామని... ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపింది.
  • Share this:
నవంబరు నెలకి సంబంధించి టీటీటీ... తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రిలీజ్ చేసింది. 69వేల 254 టికెట్లను రిలీజ్ చేస్తూ... ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ టికెట్లు కావాలనుకునే భక్తులు... ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 10 గంటల నుంచి పొందగలుగుతున్నారు. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం ద్వారా టీటీడీ... 10వేల 904 సేవా టికెట్లను రిలీజ్ చేసింది. సుప్రభాతం 7వేల 549, అర్చన 120, తోమాల 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోరుకునేవారి కోసం 2వేల 875 టికెట్లను అందుబాటులో ఉంచింది. కరెంటు బుకింగ్‌ కింద కూడా టీటీడీ అధికారులు.... 58వేల 350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. వాటిలో విశేష పూజ కోసం 15వందల టికెట్లు, కల్యాణోత్సవం కోసం 13వేల 300 టికెట్లు, ఊంజల్‌ సేవ కోసం 4వేల 200 టికెట్లు, ఆర్జిత బ్రహ్మోత్సవం కోసం 7వేల 700 టికెట్లు, వసంతోత్సవం కోసం 14వేల 850 కోట్లు, సహస్ర దీపాలంకరణ కోసం 16వేల 800 టికెట్లు విడుదల చేసింది. ఇవన్నీ భక్తులు పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నాయి. జులైలో భక్తులు హుండీల్లో వేసిన కానుకలు రూ.106కోట్ల 28లక్షలకు చేరాయి. ఈ సంవత్సరం కానుకలు రూ.100 కోట్లు దాటడం ఇది మూడోసారి. మార్చిలో రూ.105.8 కోట్లు రాగా.... జూన్‌లో రూ.100 దాకా వచ్చింది. ఇప్పుడు మరింత పెరిగింది. అందువల్ల ఎంత కాదనుకున్నా... ఈ ఏడాది హుందీ ద్వారా ఆదాయం రూ.1234 కోట్ల దాకా రావచ్చనే అంచనాలో వున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2019, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading