TTD : టీటీడీ పాలక మండలి ఖరారు... సభ్యుల జాబితా ఇదే

TTD Executive board : ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సీఎం వైఎస్ జగన్... టీటీడీ పాలకమండలి జాబితాను ఖరారు చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 2:45 PM IST
TTD : టీటీడీ పాలక మండలి ఖరారు... సభ్యుల జాబితా ఇదే
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 2:45 PM IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన వైఎస్ జగన్... ఎక్స్ అఫీషియోతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటు అవుతోంది. గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలి ఉండేది. ఇప్పుడు సంఖ్య పెంచి 28 మందికి అవకాశం కల్పించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచీ 8 మందికీ, తెలంగాణ నుంచీ ఏడుగురికీ అవకాశం ఇచ్చారు. అలాగే... తమిళనాడు నుంచీ 4గురు, కర్ణాటక నుంచీ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. అలాగే టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం.

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా :
ఆంధ్రప్రదేశ్ -

1.వి.ప్రశాంతి
2.యువి రమణ మూర్తి (MLA)


3.మల్లికార్జున రెడ్డి (MLA)
4.గొల్ల బాబూరావు (MLA)
Loading...
5.నాదెండ్ల సుబ్బారావు
6.డిపి అనంత
7.చిప్పగిరి ప్రసాద్ కుమార్
8.కె.పార్థసారథి (MLA)

తెలంగాణ -
1.జె.రామేశ్వరరావు
2.బి.పార్థసారథి రెడ్డి
3.యు.వెంకట భాస్కర రావు
4.మూరంశెట్టి రాములు
5.డి.దామోదర్ రావు
6.కె.శివ కుమార్
7.పుట్టా ప్రతాప రెడ్డి

తమిళనాడు -
1.కృష్ణమూర్తి వైద్యనాథన్
2.ఎస్.శ్రీనివాసన్
3.డాక్టర్ నిచితా ముత్తువరపు
4.కుమారగురు (MLA)

కర్ణాటక -
1.రమేష్ శెట్టి
2.సంపత్ రవి నారాయణ
3.సుధా నారాయణ మూర్తి

ఢిల్లీ -
1.ఎం ఎస్ శివ శంకరన్

మహారాష్ట్ర -
1.రాజేష్ శర్మ

ఎక్స్ అఫీషియో -
1.చైర్మన్ (TUDA)
2.SPL CS
3.కమిషనర్ ఎండోమెంట్స్
4.E.O. (TTD)

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...