తిరుమల శ్రీవారికి నిజంగానే వెంట్రుకలు ఉంటాయా? చెమట పడుతుందా?

స్వామి వారి శిల్పం శిల్పులు చెక్కినది కాదన్న రమణ దీక్షితులు.. స్వామి వారు స్వయంగా వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహమని చెప్పారు.

news18-telugu
Updated: October 3, 2019, 6:32 PM IST
తిరుమల శ్రీవారికి నిజంగానే వెంట్రుకలు ఉంటాయా? చెమట పడుతుందా?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
news18-telugu
Updated: October 3, 2019, 6:32 PM IST
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయమున్న పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక వేంకటేశ్వరుడి మహిమలు, ఏడుకొండలపై జరిగే ఘట్టాలపై భక్తులకు ఎన్నో విశ్వాసాలున్నాయి. తిరుమల శ్రీవారికి వెంట్రుకలు ఉన్నాయని.. ఆయనకు చెమట పడుతుందని ఎంతో మంది నమ్ముతారు. కొన్నేళ్లుగా ఇది ప్రచారంలో ఉంది. దీనిపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు క్లారిటీ ఇచ్చారు. స్వామి వారి శిల్పం శిల్పులు చెక్కినది కాదన్న ఆయన.. స్వామి వారు స్వయంగా వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహమని చెప్పారు.

శ్రీవారి కైంకర్యం చేసే అర్చకులు మాత్రమే స్వామి వారి వెనక వైపునకు వెళ్లగలరు. నేను కూడా అభిషేకం చేసేందుకు వెళ్లినప్పుడు స్వామి వారిని ఆపాదమస్తకం తాకాను. స్వామి వారికి వెంట్రుకలు లేవు. శిల్పంలో మాత్రమే ఉంటాయి. సహజమైన కేశములు ఆయనకు లేవు. స్వామి వారి దేహం, పాదాలు మెత్తగా ఉంటాయని, చెమట పడుతుందని భక్తులు నమ్ముతారు. మనిషి దేహం అశాశ్వతం. పంచభూతాల్లో కలిసిపోయేది. కానీ స్వామి వారి రూపం అప్రాకృతం. అంటే ప్రకృతికి సంబంధ పడనిది. ఆయనకు చెమట పడుతుందని, దేహం మెత్తగా ఉందని అపాదించలేం.
రమణ దీక్షితులు


వేంకటేశ్వర స్వామికి పుట్టుక, మరణం, దేహం వంటివి ఉండవని చెప్పారు రమణ దీక్షితులు. కానీ స్వామి వారి శిల్పానికి ముఖబింబం, నేత్రాలు, నాసిక, అందమైన పెదాలు, మొహం మీద చిరునవ్వు, చతుర్భుజాలు, పాదాలు, గోళ్లు, హస్త రేఖలు ఉంటాయని చెప్పారు. స్వామి వారి విగ్రహం దేనితో తయారైందన్నది ఇప్పటికీ తెలియదని ఆయన వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు రమణ దీక్షితులు.
First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...