TTD: ఆ మార్గదర్శకాల మేరకే చిన్నపిల్లలు, వృద్దులకు శ్రీవారి దర్శనం.. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వేళ చిన్నపిల్లలకు, వృద్దులకు శ్రీవారి దర్శనం కల్పించడంపై ప్రభుత్వం సూచించిన అన్‌లాక్ మార్గదర్శకాలు మేరకు నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు.

  • Share this:
    కరోనా వేళ చిన్నపిల్లలకు, వృద్దులకు శ్రీవారి దర్శనం కల్పించడంపై ప్రభుత్వం సూచించిన అన్‌లాక్ మార్గదర్శకాలు మేరకు నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో కేఎస్ జవహర్‌రెడ్డి ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోన్‌లో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా టీటీడీ రద్దు చేసిన అర్జిత సేవల స్థానంలో భక్తులకు డిసెంబర్ చివరి వరకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. శివకేశవుల అబేధం చెప్పేందుకే శ్రీవారి సన్నిధిలో కార్తీక మహావ్రతాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.

    కోవిడ్-19 నేపథ్యంలో శ్రీవారి బ్రహోత్సవాల తరహాలోనే నవంబర్ 11 నుంచి తిరుచానూర్‌లో వార్షిక కార్తీక మహోత్సవాలని ఏకాంతంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శాశ్వత ప్రతిపాదికన ధార్మిక కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ చేసే వ్యవహారంపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. తిరుమల కొండపై వివాహాలు చేసుకోవాలనుకునేవారిపై కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం 200 మంది అతిథుల పరిమితితో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. 2021 సంవత్సరం టీటీడీ డైరీ, క్యాలెండర్ భక్తులకు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: