హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అప్పుడే శ్రీవారి దర్శనం... క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఈవో

అప్పుడే శ్రీవారి దర్శనం... క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఈవో

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్

తిరుమలలో మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు.

  తిరుమలలో మళ్లీ భక్తులకు శ్రీవారి దర్శనం ఎప్పుడు ఉంటుందనే అంశంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. మే 3 తరువాత లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మే 3 తరువాత టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. తిరుమలలో మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

  శ్రీపద్మావతి ఉత్సవానికి కనీసం 70 మంది అవసరం పడుతుందన్న టీటీడీ ఈవో... సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత సమయంలో ఇది కష్టతరమవుతుందని అన్నారు. శార్వరి నామ సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ఉత్సవాలను నిర్వహించుకునే అవకాశం ఉందని... తదుపరి భక్తులందరి సమక్షంలోనే ఉత్సవాలను నారాయణగిరిలో వైభవంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జూన్ 30 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీన్ని టీటీడీ ఖండించిన సంగతి తెలిసిందే.


  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

  ఉత్తమ కథలు