ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీపికబురు...

టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు బర్డ్ లో ఇక మీదట నగదు రహిత సేవలు, సర్జరీలు అందనున్నాయి.

news18-telugu
Updated: May 29, 2020, 10:04 PM IST
ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీపికబురు...
జూన్ 8 నుంచి తిరుమలలో భక్తులకు అనుమతి?... ఇవీ కొత్త రూల్స్...
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు బర్డ్ లో ఇక మీదట నగదు రహిత సేవలు, సర్జరీలు అందనున్నాయి. శనివారం తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బర్డ్ ట్రస్ట్ సమావేశం జరిగింది. సిమ్స్ తరహాలో టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు ఉచిత సేవలు, సర్జరీలు చేసి టీటీడీ నుంచి బిల్లు వసూలు చేసుకోవడానికి కమిటీ ఆమోదం తెలిపింది. బర్డ్ లో రోగులకు యంత్రం ద్వారా ఫిజియోథెరపి చేయడానికి దక్షిణ ఆసియాలో ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని రోబో అసిస్టెడ్ గెయిట్ ట్రైనింగ్ థెరఫీ యంత్రం కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. రూ.5.5 కోట్లతో టెండర్ల ద్వారా ఈ యంత్రం కొనుగోలు చేయనున్నారు. రోగులకు రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉందో గుర్తించడానికి ఉపయోగపడే 2డి కలర్ డాప్లర్ యంత్రం కొనుగోలు చేయడానికి కమిటీ అనుమతించింది. అయితే ఈ యంత్రం ఉచితంగా ఏర్పాటు చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి సేవలు ఉపయోగించుకోవాలని కమిటీ అధికారులకు సూచించింది.

బర్డ్ కు సంబంధించిన ఇన్ కం టాక్స్ వ్యవహారాలు చూడటం కోసం ఆడిటర్లను నియమించుకోవడానికి కమిటీ అంగీకారాన్ని తెలిపింది. ఆర్థోపెడిక్ వైద్యంలో నిష్ణాతులైన వైద్యులు విద్యాసాగర్ ( తిరుపతి ) ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ( నెల్లూరు) డాక్టర్ గురువారెడ్డి ( హైదరాబాద్) సేవలను ఉచితంగా ఉపయోగించుకోవడానికి కమిటీ ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివశంకరన్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ , జేఈఓ బసంత్ కుమార్ పద్మావతి విశ్రాంతి గృహం నుంచి సమావేశంలో పాల్గొన్నారు.
First published: May 29, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading