తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రమం అంశంపై ఏపీలో తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మాన్యాలు, కానుకలు, భూముల విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం చేసింది. గురువారం వీడియో సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు నిరుపయోగంగా పడివున్న శ్రీవారి ఆస్తులు, స్థలాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కమిటీలో పాలకమండలి సభ్యులు, మఠాధిపతులు, స్వామిజీలు, భక్తులు సభ్యులుగా ఉంటారు. గత పాలకమండలి నిర్ణయాలతో తమపై బురద చల్లిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇక పాత గెస్ట్ హౌస్ పునరుద్ధరణకు పారదర్శకంగా డొనేషన్ విధానంలో పునర్నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్వహణకు పాలకమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపు ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు తీసుకొని తిరుమలలో భక్తుల దర్శనాన్ని పునఃప్రారంభిస్తామని టీటీడీ తెలిపింది. శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd