నిరర్థకంగా ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటి విలువ కోటి 50 లక్షల రూపాయలుగా గుర్తించిన టీడీపీ...టెండర్ల ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 30న కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. నిరర్థకమైన ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 100 కోట్లు సమకూర్చుకోవాలని భావించిన టీటీడీ... 2020-21 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
అప్పట్లోనే దీనిపై 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు బృందాలను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. మరోవైపు టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతల మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.