ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు నవగ్రహ మంత్ర జపం, నవగ్రహ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల ప్రాంగణంలో శుక్రవారం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు నిర్వహిస్తున్న నవగ్రహ శాంతి హోమంలో ఛైర్మన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మార్చి 17వ తేదీ నుంచి జప, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యాయన సంస్థ, తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి మహాయాగం, శ్రీ ధన్వంతరి మహామంత్రం పారాయణం తదితర ధార్మిక కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. నవగ్రహ శాంతి హోమంలో భాగంగా కలశ స్థాసన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొన్న రుత్వికులకు ఛైర్మన్ దంపతులు వస్త్ర బహుమానం అందించారు. ఈ హోమములో ఎస్వీ వేద వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Ttd