రమణ దీక్షితులు సన్నిహితుడిపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

రమణ దీక్షితులు (ఫైల్ ఫొటో)

డాలర్ శేషాద్రికి ఇప్పటికి మూడు సార్లు నిర్వహించిన కోవిడ్ పరిక్షలో నెగటివ్‌గా తేలింది. అయినా తనను మానసికంగా వేధించడంతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారంటూ టీటీడీకి శేషాద్రి పిర్యాదు చేశారు.

  • Share this:
    సోషల్ మీడియాలో డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న రమణదీక్షితులు సన్నిహితుడు బద్రిపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అసలు విషయానికొస్తే... డాలర్ శేషాద్రి ఆరోగ్య రిత్యా ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. అందులో భాగంగా చెన్నైలోని అపోలోలో పరీక్షలు చేయించుకున్నారు. అయితే శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ బద్రి వరుస ట్వీట్లు చేయడం కలకలం రేపింది. దీంతోపాటు సీఎం జగన్, చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కించపరుస్తూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. ఃః    అయితే డాలర్ శేషాద్రికి ఇప్పటికి మూడు సార్లు నిర్వహించిన కోవిడ్ పరిక్షలో నెగటివ్‌గా తేలింది. అయినా తనను మానసికంగా వేధించడంతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారంటూ టీటీడీకి శేషాద్రి పిర్యాదు చేశారు. దీంతో బద్రిపై ఎపిడెమిక్ యాక్ట్ మేరకు చర్యలు తీసుకోవాలని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే కొంతకాలంగా తన ట్వీట్స్ ద్వారా టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రమణ దీక్షితులు ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అర్చకులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు... శ్రీవారి దర్శనాలు నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా అంశంతోపాటు టీటీడీ ఈవో, ఇతర అధికారులపై రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: