
ఆ పాత నోట్లను మార్చండి మేడం.. నిర్మలకు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి
భక్తులు కానుకగా సమర్పించిన రద్దైన పాతనోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. టీటీడీ వద్ద రూ.50 కోట్ల మేర అలాంటి నోట్లు ఉన్నాయని.. వాటిని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
మన దేశంలో నోట్ల రద్దు జరిగి దాదాపు నాలుగేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటికీ అక్కడక్కడా రద్దైన పాతనోట్లు బయటపడుతూనే ఉన్నాయి. ఐతే తిరుమల శ్రీవారి హుండీలోనూ పాత నోట్లను కానుకగా వేశారు చాలా మంది భక్తులు. అలా టీటీడీ వద్ద కూడా పెద్ద మొత్తంలో పాత నోట్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. భక్తులు కానుకగా సమర్పించిన రద్దైన పాతనోట్లను మార్పిడి చేయాలని కోరారు. టీటీడీ వద్ద రూ.50 కోట్ల మేర అలాంటి నోట్లు ఉన్నాయని.. వాటిని మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు వైవీ సుబ్బారెడ్డి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వెనకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు.
Published by:Shiva Kumar Addula
First published:July 13, 2020, 18:36 IST