YV SubbaReddy: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనాకు విరుగుడుగా ఇవ్వతలపెట్టిన మందుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదిహేను రోజుల బ్రేక్ తర్వాత ఆనందయ్య మందు పంపిణీకి జగన్ సర్కార్ అనుమతినిచ్చిన ఈ తరుణంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

  • Share this:
    తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనాకు విరుగుడుగా ఇవ్వతలపెట్టిన మందుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదిహేను రోజుల బ్రేక్ తర్వాత ఆనందయ్య మందు పంపిణీకి జగన్ సర్కార్ అనుమతినిచ్చిన ఈ తరుణంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ఆయుష్ ఇచ్చిన రిపోర్టులో ఆనందయ్య మందు ఆయుర్వేదం మందు కాదు అని చెప్పిందని వైవీ వ్యాఖ్యానించారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుతో కోవిడ్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదని.. అయితే వాడొద్దు అని కూడా చెప్పలేదని తెలిపారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆ మందు తీసుకోవాలా, వద్దా అనే నిర్ణయాన్ని ప్రజల ఇష్టానికి వదిలేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆయుర్వేదం కాదు కనుక ఆనందయ్య మందును పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని టీటీడీ ఆయుర్వేద కాలేజ్ విరమించుకుందని ఆయన తెలిపారు. ఆనందయ్య మందును టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని మొదట్లో భావించామని.. అయితే ప్రస్తుతానికి పంపిణీ ఆలోచన లేదని వైవీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో రిపోర్టులు మెరుగ్గా వస్తే పరిశీలిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

    ఇదిలా ఉంటే.. కరోనాకు విరుగుడుగా ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పందించారు. ఆనందయ్య మందుకు ప్రభుత్వం సంప్రదాయ మందుగా వినియోగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెవిరెడ్డి చెప్పారు. ఇమ్యూనిటి బూస్టర్‌గా పనిచేస్తున్న ఆనందయ్య మందును ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడవచ్చని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా ముందుస్తు ప్రయోజనకరంగా ఆనందయ్య మందుని ఇంటింటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తుడా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంలో చెవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఇది కూడా చదవండి: Sonusood: మరీ ఇంత మంచోడివేంటి సోనూసూద్... ఉదయం సోనూసూద్ వాట్సాప్‌కు మెసేజ్ పంపారో, లేదో.. సాయంత్రానికి..

    కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, హైకోర్టు కూడా ఆనందయ్య మందును పంపిణీ చేయాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆనందయ్య పంపిణీ చేసే మందు కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటం.. అలా రావడం వల్ల కోవిడ్-19 వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాదం ఉండటంతో మందు పంపిణీకి జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించారు.

    ఆనందయ్యతో సమావేశమైన కలెక్టర్ చక్రధర్.. ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా మందును పంపిణీ చేస్తామని, ఎవరూ కృష్ణపట్నం రావొద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీ చేస్తామని.. అయితే అందుకు ఐదు రోజుల సమయం పడుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published: