TTD: ఔనంటే కాదనిలే..? టీటీడీ చైర్మన్ వర్సెస్ అధికారులు..? సంప్రదాయ భోజనంపై సంచలన నిర్ణయం

సంప్రదాయ భోజనంపై వెనుకడుగు

TTD Board: తిరుమలలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన సంప్రదాయ భొజనం కథ ముగిసింది. మూడు రోజుల ముచ్చటే అయ్యింది. తమకు తెలియకుండా అధికారులే ఆ పథకాన్ని ప్రారంభించారని స్వయంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే చెప్పారు. నిజంగా పాలకమండలితో సంబంధం లేకుండానే అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారా..?

 • Share this:
  Sampradaya Bhojanam: వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tiruapati Devasthanam). నిత్యం ఏదో ఒక అంశం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా ప్రకటిస్తూ తిరుమలలో సంప్రదాయ భోజనం  కార్యక్రమం (Sampradaya Bhojanam) ప్రారంభమైంది. కాని అది మూడు రోజుల ముచ్చటే అయ్యింది. ఇటీవల అంటే ఆగస్టు 26న ప్రారంభించారు. గో ఆధారిత సాగుద్వారా పండించిన పంటతో చేసిన “సంప్రదాయ భోజనం” అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంప్రదాయ భోజనాన్ని అన్నప్రసాద కేంద్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ భోజన కార్యక్రం ప్రారంభానికి ముందు అధికారులు పదే పదే ఇదో అద్భుత కార్యక్రమం అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. ప్రారంభం రోజున కూడా పదే పదే ఇదే మాట చెబుతూ వచ్చారు. కానీ అప్పుడు దీనిపై పాలకమండలి కానీ, టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) కానీ అభ్యంతరాలు చెప్పలేదు. తొలి రోజు భోజనం అద్భుతంగా ఉంది అంటూ ప్రచారం చేయించుకున్నారు. అయితే ఇది వివాదాస్పదమైంది. డబ్బులు తీసుకుని ప్రసాదం పెట్టడమేంటని భక్తులు మండిపడ్డారు. దీంతో ఈ పథకంపై ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు.

  తిరుమలలో భక్తులకు ఏదీ ఇచ్చినా ప్రసాదం గానే ఇవ్వాలి..గానీ.. సంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు. ఈ నిర్ణయం టీటీడీ పాలక మండలి తీసుకుందని కాదని స్పష్టం చేశారు. అధికారుల నిర్ణయం తీసుకున్నారని వారితో మాట్లాడి సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని విరమిస్తామన్నారు. సోషల్‌మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, భక్తులు ఎవరూ నమ్మద్దని ఆయన కోరారు. శ్రీవారి నైవేద్యం, కైంకర్యాలకు కావాల్సిన పదార్థాలు.. సంప్రదాయబద్ధంగా గోవుల నుంచి సేకరించిన పాలు, నెయ్యి, వెన్నను స్వామి వారికి అందిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఏ ఆహారంమైనా స్వామి వారి ప్రసాదంగానే అందించాలని.. అందుకే సంప్రదాయ భోజనాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం‌ తీసుకున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

  ఇక భక్తులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…శ్రీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవను నేటి నుంచి శ్రీవారి ఆలయంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత దర్శనంపై జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొంతమంది భక్తులకు అయినా.. ఉచిత దర్శనానికి అనుమతిచ్చేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి.

  ఇదీ చదవండి: బిగ్ బాస్ 5లో కంటెస్టెంట్ల మార్పుకు కారణం ఇదే.. ఎవరు ఏ పాటకు డ్యాన్స్ వేస్తారంటే..? ఫైనల్ లిస్ట్ ఇదే

  అయితే తాజా అంశంపై అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. అధికారులకు, పాలకమండలి సభ్యులకు మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నిజంగా సంప్రదాయ భోజనం విషయం పాలకమండలి కి చెప్పకుండా అధికారులే ప్రారంభిస్తారు.. కనీసం ప్రారంభం రోజైనా పాలకమండలికి విషయం తెలియాలి కదా.. అది కూడా ఎవరికీ చెప్పుకుండా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా చేతులు దులుపుకోలేదు.. భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసి మరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు ఎందుకు పాలమండలి నోరు మెదపలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాలకమండలి చైర్మన్ సంప్రదాయ భోజనాన్ని విరమిస్తున్నామని ప్రకటిస్తే..అయితే అధికారులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు..
  Published by:Nagesh Paina
  First published: