హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై టీటీడీ ఛైర్మన్ క్లారిటీ

తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై టీటీడీ ఛైర్మన్ క్లారిటీ

నూతనంగా కళ్యాణ మండపాల నిర్మాణానికి విధివిధానాలు రూపకల్పన.

నూతనంగా కళ్యాణ మండపాల నిర్మాణానికి విధివిధానాలు రూపకల్పన.

నిరర్థక ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గతంలోనూ దేవుడి భూములను వేలం వేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 1974 నుంచి 2014 ఇప్పటి వరకు 129 ఆస్తులను అమ్మారని.. చంద్రబాబు హయంలో 15 నుంచి 20 ఆస్తులను వేలంవేసినట్లు ఆయన గుర్తు చేశారు.

తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఏపీ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. పలు రాజకీయ పార్టీలతో పాటు సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్తుల వేలం వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆస్తులను వేలం వేయాలన్న నిర్ణయం పాత బోర్డే తీసుకుందని.. దానిపై తాము సమీక్ష మాత్రమే చేస్తున్నామని చెప్పారు. రిపోర్టు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. దీనిపై రాజకీయాలు చేయడం తగదని విపక్షాలపై విరుచుకుపడ్డారు.

మేం దేవుడి సేవలోనే ఉన్నాం. కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు బాధాకరం. తిరుమల వెంకన్నతో రాజకీయాలు వద్దు. ఆస్తులను వేలం వేయాలన్న నిర్ణయం పాత బోర్డే తీసుకుంది. జనవరి 30, 2016న తీర్మానం చేశారు. దానిపై మేము సమీక్ష మాత్రమే చేస్తున్నాం. అసలు అమ్మకానికి ఆస్కారం ఉందా? ఒకవేళ అమ్మాలంటే ఏ విధంగా చేయాలి?వాస్తవ పరిస్థితులను గమనించి రోడ్ మ్యాప్ తయారు చేయాలని మాత్రమే చెప్పాం. రిపోర్టు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం.
వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఛైర్మన్

నిరర్థక ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గతంలోనూ దేవుడి భూములను వేలం వేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 1974 నుంచి 2014 ఇప్పటి వరకు 129 ఆస్తులను అమ్మారని.. చంద్రబాబు హయంలో 15 నుంచి 20 ఆస్తులను వేలంవేసినట్లు ఆయన గుర్తు చేశారు. శ్రీవారి ఆస్తులను ఎలా కాపాడుకోవాలి? భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా వ్యవహరించాలి? అనే దానిపై ధార్మిక సంస్థలు, నిపుణుల సలహాలను కూడా స్వీకరిస్తామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. కబ్జా కాకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.

అటు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని విపక్షాలపై విరుచుకుపడ్డారు సుబ్బారెడ్డి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు కొట్టేయాలని చూశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను కాపాడే ప్రయత్నం చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఆస్తులను కాపాడటంలో భాగంగానే సమీక్షలు జరిపామన్నారు సుబ్బారెడ్డి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd, YV Subba Reddy

ఉత్తమ కథలు