హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీటీడీని టెన్షన్ పెడుతున్న కరోనా... వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

టీటీడీని టెన్షన్ పెడుతున్న కరోనా... వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక‌ మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.

అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక‌ మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.

రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

  టీటీడీలో ఇప్పటి వరకు 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో అధికారులతో, అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన... తిరుమలలో అధిక శాతం ఏపీఎస్పీలో పని చేసే సెక్యురిటి సిబ్బందికి, పోటు కార్మికులకే కరోనా నిర్ధారణ అయిందని వివరించారు. వీరిలో 70 మంది వరకు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. వారిలో కొందరు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని వివరించారు. మరికొందరు డ్యూటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 70 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైవీ సుబ్బారెడ్డి.. అందులో ఒక్కరు మాత్రమే ఐసియులో చికిత్స పొందుతున్నారని వివరించారు.

  రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. బోర్డుకు సలహాలు ఇవ్వాలే కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదని తెలిపారు. ఏవరైనా సరే టిటిడి విషయంలో, దర్శన విధి విధానాల విషయాంలో రాజకీయ రంగులు పులమొద్దని ఆయన హెచ్చరించారు..అర్చకులకు ఏ విధంగా ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అర్చకుల కోసం దర్శనాలు ఆపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక‌ మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Ttd, YV Subba Reddy

  ఉత్తమ కథలు