• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TTD CHAIRMAN YV SUBBA REDDY WILL BE THE CHIEF GUEST AT CHRISTMAS CELEBRATIONS IN RAJAHMUNDRY BA

క్రిస్మస్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా టీటీడీ చైర్మన్...

క్రిస్మస్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా టీటీడీ చైర్మన్...

అర్చకులకు ఏ విధంగా ఇబ్బంది కలుగకుండా మా అభిప్రాయాలు తీసుకున్నామని, అర్చకుల కోసం దర్శనాలు ఆపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు.

క్రిస్మస్ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరవుతున్నట్టుగా ఓ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    క్రిస్మస్ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరవుతున్నట్టుగా ఓ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని DMCH స్కూల్ ఆవరణలో ఈనెల 21న జరిగే వేడుకలకు ఆత్మీయ విశిష్ట అతిథిగా వైసీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు అవుతున్నారంటూ ఓ ఆహ్వానపత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ముద్రించిన ఆ ఇన్విటేషన్ కార్డులో ప్రసంగీకులుగా రెవరెండ్ జక్కల లాల్ బహదూర్ శాస్త్రి (క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్) పేరును కూడా ప్రచురించారు. ఈ ఆహ్వాన కమిటీలో 21 మంది పేర్లు ప్రచురించారు. అందులో పేర్లన్నిటికీ చివర ‘వైసీపీ నాయకులు’ అని ఉంది.

    క్రిస్మస్ వేడుకలకు వైవీ సుబ్బారెడ్డి విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్టు ప్రచారం అవుతున్న ఆహ్వానపత్రిక


    సహజంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి హైందవ ధార్మిక సంస్థల్లో ఉండే వారు అన్యమత ప్రచారానికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొనరు. గతంలో టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించిన పుట్టా సుధాకర్ రెడ్డి ఓ సారి చర్చికి వెళ్లిన వీడియో వైరల్ కావడంతో ఆయన మీద హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

    వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించినప్పుడు కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆయన హిందువు కాదని, క్రైస్తవుడని కొందరు ఆరోపించారు. అయితే, తాము స్వచ్ఛమైన హిందువులమని, పూజలు, వృతాలు చేస్తామని ఆయన కుటుంబం ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు