Home /News /andhra-pradesh /

TTD CHAIRMAN YV SUBBA REDDY SLAMS BAD PROPAGANDA ON SRIVARI SEVA TIKECTS PRICE ISSUE FULL DETAILS HERE PRN TPT

TTD: అలాంటి వారికి శ్రీవారే బుద్ధిచెబుతాడు.. అసత్య ప్రచారంపై మండిపడ్డ వైవీ సుబ్బారెడ్డి..! లీగల్ చర్యలకు సిద్ధం..

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

తిరుమల శ్రీవారి సేవా టికెట్ల (Tirumala Seva Tickets) విషయంలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తిరుమల శ్రీవారి సేవా టికెట్ల (Tirumala Seva Tickets) విషయంలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి సేవా టికెట్ల జారీలో విఐపిల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో జరిపిన చర్చను వక్రీకరించి కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దౌర్భాగ్యమని ఆయన విమర్శించరు. పాలక మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే అభిప్రాయంతోనే ఎస్వీబీసీలో లైవ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా తాము ఈ అంశం చర్చించలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకుల చెవులకు వినిపించక పోవడం తమ తప్పుకాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

    సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల్లో ఆందోళన రేపే ప్రయత్నాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సఫలం కానివ్వరనే విషయం వారు గుర్తించాలని సుబ్బారెడ్డి హితవుపలికారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు టీటీడీ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. పాలకమండలి సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    ఇది చదవండి: ఏపీలో అరకు, పాడేరుకు ధీటుగా మరో టూరిజం స్పాట్.. అభివృద్ధికి కేంద్రం నిధులు.. విశేషాలివే..!


    ఇదీ వాస్తవం..

    ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై చాలాకాలంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సేవాటికెట్లు ప‌రిమితంగా ఉండ‌గా, సిఫార‌సు లేఖ‌లు మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని.., సిఫార‌సుల‌ను త‌గ్గించేందుకు విచక్షణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే ఎలా ఉంటుంద‌నే విష‌యంపై చ‌ర్చ మాత్రమే జ‌రిగింద‌న్నారు. విఐపిల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    ఇది చదవండి: పాములు నిజంగానే పగబడతాయా..! ఇదిగో ప్రూఫ్ అంటున్న కుటుంబం


    ఈ కార్యక్రమాలు కనిపించలేదా ?
    గత రెండున్నేళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున హిందూ ధర్మప్రచార కార్యక్మరాలు నిర్వహిస్తున్నామని ఛైర్మన్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించామ‌న్నారు. రెండో విడతగా దాదాపు 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ttd, YV Subba Reddy

    తదుపరి వార్తలు