హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anandayya Medicine: ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్.. టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

Anandayya Medicine: ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్.. టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అధికారికంగా నివేదిక రాలేదని.. ఆ నివేదిక రాకుండా ఎలాంటి అనుమతులు అవ్వమని స్పష్టం చేసింది. చుక్కల మందు వల్ల ఎలాంటి హాని జరగదని నివేదిక వస్తేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పింది.

ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అధికారికంగా నివేదిక రాలేదని.. ఆ నివేదిక రాకుండా ఎలాంటి అనుమతులు అవ్వమని స్పష్టం చేసింది. చుక్కల మందు వల్ల ఎలాంటి హాని జరగదని నివేదిక వస్తేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పింది.

Anandayya Medicine: ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్యయనం చేయనుందని వెల్లడించారు.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాకే ఆనందయ్య మందుపై ముందుకు వెళ్లాలని సీఎం జగన్ స్పష్టం చేశారని టీటీడీ చైర్మన్, వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీసీఆర్ఏఎస్, టీటీడీ ఆయుర్వేద కళాశాల అధ్యయనం తరువాత క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఐదారు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్యయనం చేయనుందని వెల్లడించారు. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది పరిస్థితిని అధ్యయనం చేసే ప్రక్రియ నేడు ప్రారంభమైందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆనందయ్య మందు విషయంలో ఐసీఎంఆర్ చేయగలిగింది ఏమీ లేదన్న ఆయన.. దీనిపై కేంద్ర ఆయుష్ శాఖే నిర్ధారించాల్సి ఉంటుందని అన్నారు.

  ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ తేల్చింది. జనం నుండి అనూహ్య మద్దతు వస్తుండటంతో మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఈ మందులో ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని గుర్తించామన్నారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh

  ఉత్తమ కథలు