Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా... ఏపీ మంత్రి వార్నింగ్ ఎఫెక్ట్ ?

    టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు ఆయన లేఖ రాశారు.

    news18-telugu
    Updated: June 19, 2019, 5:54 PM IST
    టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా... ఏపీ మంత్రి వార్నింగ్ ఎఫెక్ట్ ?
    జూన్‌ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.
    • Share this:
    టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేసేంతవరకు తాను బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేసిన పుట్టా సుధాకర్ యాదవ్... ఎట్టకేలకు తన మనసు మార్చుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు లేఖ పంపారు. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తామని ఉదయం ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తిరుమలలోనే ప్రకటించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వెల్లంపల్లి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడం గమనార్హం.

    ttd chairman putta sudhakar yadav,putta sudhakar yadav,ttd chairman,ttd chairman putta sudhakar,chairman putta sudhakar yadav,putta sudhakar yadav ttd,yv subba reddy ttd chairman,ttd chairman putta sudhakar yadav interview,ttd chairman putta sudhakar yadav about ttd,ttd chairman yv subba reddy,putta sudhakar,putta sudhakar yadav latest interview,chairman putta sudhakar,new ttd chairman,ttd controversies,ttd latest news,టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా,టీటీడీకి పుట్టా రాజీనామా,ఏపీ మంత్రి వెల్లంపల్లి,వైసీపీ,టీడీపీ,టీటీడీ వివాదాలు,చంద్రబాబునాయుడు,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి
    పుట్టా సుధాకర్ యాదవ్(ఫైల్ ఫోటో)


    పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడంతో... టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేయడం ఇక లాంఛనమే. టీటీడీ చైర్మన్ పదవికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తమ పార్టీ సీనియర్ నేత, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఖరారు చేశారు. శనివారం ఆయన టీటీడీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్‌గా రాజీనామా చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున మైదకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

    Published by: Kishore Akkaladevi
    First published: June 19, 2019, 5:09 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading