ఆన్‌లైన్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు: సెప్టెంబరు 14 నుంచి..

క్యాలెండర్లను బుక్‌ చేసుకున్న భక్తులకు ఎటువంటి జాప్యం లేకుండా వాటిని సప్లై చేయాలని.. దీనిపై పోస్టల్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు జేఈవో సూచించారు.

news18-telugu
Updated: September 12, 2018, 9:32 PM IST
ఆన్‌లైన్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు: సెప్టెంబరు 14 నుంచి..
తిరుమల దేవస్థానం ఫైల్ ఫోటో..
  • Share this:
టీటీడీ ముద్రించిన 2019 క్యాలెండర్లు, డైరీలను సెప్టెంబరు 13వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారని తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు. సెప్టెంబరు 14వ తేదీ నుంచి ttdsevaonline.com వెబ్‌సైట్‌లో వీటిని భక్తులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని జేఈవో కార్యాలయంలో పోల భాస్కర్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.డైరీలు, క్యాలెండర్లను బుక్‌ చేసుకున్న భక్తులకు ఎటువంటి జాప్యం లేకుండా వాటిని సప్లై చేయాలని..దీనిపై పోస్టల్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు.

క్యాలెండర్లు, డైరీల సప్లైకి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారాన్ని భక్తులకు తెలియజేయాలన్నారు. అంతకుముందు సప్తగిరి మాసపత్రికపై జేఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.సప్తగిరి మాసపత్రికను క్రమం తప్పకుండా పాఠకులకు అందించాలని అధికారులకు సూచించారు.స్వదేశీ, విదేశీ చందాదారుల చిరునామా వివరాలతో కంప్యూటర్‌ అప్లికేషన్‌ రూపొందించాలని, తద్వారా పత్రిక సక్రమంగా చేరేలా చూడవచ్చని చెప్పారు. చందాదారులు సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు, చిరునామా మార్పు వివరాలను తెలిపేందుకు ఒక ఇ-మెయిల్‌ ఐడిని రూపొందించాలని సూచించారు.

చందాదారుల చిరునామా సరిగా లేనిపక్షంలో పత్రిక తిరిగి కార్యాలయానికి చేరేలా చూడాలని పోస్టల్‌ అధికారులను కోరారు.ఈ సమావేశాల్లో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఎడిటర్‌ డా.రాధారమణ, సేల్స్‌ వింగ్‌ డెప్యూటీ ఈవో శ్రీహేమచంద్రారెడ్డి, ఎడిటర్‌ డా.వి.జి.చొక్కలింగం, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య, పోస్టల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.


First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...