Home /News /andhra-pradesh /

TTD BUDGET RS 3309 CRORES INCREASED TOLL TAX AT ALIPIRI AND CYBERCRIME DEPT TO COUNTER FAKE NEWS BA

టీటీడీ బడ్జెట్ ఇదే... అలిపిరి వద్ద వాహనాలకు టోల్ ఫీజు పెంపు..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చేందుతున్న క్రమంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం అయినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చేందుతున్న క్రమంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం అయినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే, పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. 2020-21 సంవత్సరానికి గాను రూ.3,309 కోట్ల బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది కంటే రూ. 66 కోట్ల మేర టీటీడీ బడ్జెట్ పెరిగింది. బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు రూ.3.30 కోట్లతో థర్మో ఫ్లూయిడ్ స్టౌలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

    • సోషల్ మీడియాలో టీటీడీ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం.

    • అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు...కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టీటీడీ.

    • తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం.

    • రూ.34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..

    • బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు.

    • చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు.

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీటీడీ టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం.

    • శార్వరినామ సంవత్సర టీటీడీ నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Tirumala tirupati devasthanam, Ttd, YV Subba Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు