శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఉంచిన వెండి పళ్తలేన్ని తలపై ఉంచి ఆలయంలోకి ప్రవేశించిన జగన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

news18-telugu
Updated: September 30, 2019, 11:00 PM IST
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
వైఎస్ జగన్
  • Share this:
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వేంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు సాయంత్రం తిరుమల చేరుకున్న వైఎస్ జగన్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జగన్‌కు పరివట్టం చుట్టారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఉంచిన వెండి పళ్తలేన్ని తలపై ఉంచి ఆలయంలోకి ప్రవేశించిన జగన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మరోవైపు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోవిందుడి నామస్మరణతో ఏడుకొండలు మార్మోగిపోతున్నాయి. ఇవాళ పెద్ద శేష వాహనంపై శ్రీవారు దర్శనమివ్వడంతో.. ఆ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకరించి పునీతులయ్యారు భక్తులు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...