Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం ?

    ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని టీటీడీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

    news18-telugu
    Updated: July 2, 2019, 11:44 AM IST
    టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం ?
    తిరుమల శ్రీవారి ఆలయం
    • Share this:
    టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)లో కీలక మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న పాలకమండలి నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... ఆ దిశగా సంచలన నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిన వైవీ సుబ్బారెడ్డి... కొత్త పాలకమండలి కొలువుదీరిన వెంటనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    వీఐపీ బ్రేక్ దర్శనాల విభజన కారణంగా సామాన్య భక్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనే భావనలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి... ఈ విభజనను రద్దు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం కేటాయించే సమయాన్ని కుదించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీలో సామాన్య భక్తుల ఇబ్బందులు తొలగించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని అనేకసార్లు చెప్పిన వైవీ సుబ్బారెడ్డి... పాలకమండలి ఏర్పడిన అనంతరం జరిగే తొలి సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
    Published by: Kishore Akkaladevi
    First published: July 2, 2019, 11:44 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading