టీటీడీ పాలకమండలిలో కలకలం... ఒకే పోస్టుకు ఇద్దరి నియామకం

అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం అందించారు. అంతేకాదు అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణానికి ఏర్పాట్లు కూడా చేశారు.

news18-telugu
Updated: September 29, 2019, 1:00 PM IST
టీటీడీ పాలకమండలిలో కలకలం... ఒకే పోస్టుకు ఇద్దరి నియామకం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణం విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ సభ్యుడిని నేనంటే నేనంటూ ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితుడైన ప్రముఖుడెవరనే అంశం టీటీడీని ముప్పుతిప్పలు పెడుతోంది. ముంబైకి చెందిన రాజేష్ శర్మని ప్రభుత్వం నియమించింది. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం అందించారు. ఒకరికి బదులు మరొకరికి సమాచారం అందించారు. అంతేకాదు అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఆయనకు అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని కూడా పంపించేశారు. అయితే తాజాగా ముంబైకు చెందిన రాజేశ్ శర్మ టీటీడీని సంప్రదించడంతో అధికారుల తప్పిదం బయటపడింది. దీంతో ఇప్పుడు ఎవరిచేత ప్రమాణం స్వీకారం చేయించాలో తెలియక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...