హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీటీడీ భూముల వేలంలో ట్విస్ట్.. వ్యతిరేకిస్తున్న బోర్డు సభ్యుడు

టీటీడీ భూముల వేలంలో ట్విస్ట్.. వ్యతిరేకిస్తున్న బోర్డు సభ్యుడు

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. దీనిపై మే 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టుతున్నారు. సేవ్ తిరుమల పేరుతో ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఐతే శ్రీవారి ఆస్తుల వేలంపై కేవలం విపక్షాలు, ప్రజాసంఘాలు మాత్రమే.. కాదు టీటీడీ బోర్డులోనూ వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ రాకేష్ సిన్హా బోర్డు నిర్ణయాన్ని తప్పుబట్టారు. టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు రాకేష్ సిన్హా.

ఇది భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశమని.. ఆస్తుల వేలం నిర్ణయంపై పున:సమీక్ష చేయాలని టీటీడీనీ కోరారు. తిరుమల శ్రీవారి ఆస్తులను కాపాడుకోవడం పెద్ద సమస్య కాదని.. అవసరమైతే ఇందులో భక్తులను కూడా భాగస్వాములను చేయవచ్చని సూచించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెప్పి.. ఇప్పుడు ఆస్తులను అమ్మడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీవారికి భక్తులకు సమర్పించిన ఆస్తుల వెనుక ఉండే మనోభావాలను గౌరవించాలని లేఖలో పేర్కొన్నారు రాకేష్ సిన్హా.


కాగా, తిరుమల శ్రీవారి స్థిరాస్తులను వేలం వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 28 ఆస్తులు విక్రయించేందుకు రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. దీనిపై మే 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

ఉత్తమ కథలు