తిరుమల వేంకటేశ్వరుని ఆస్తుల వివరాలు టీటీడీ వెబ్‌సైట్‌లో..?

టీటీడీ ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి ప్రతిపాదించారు. దీనిపై సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు.

news18-telugu
Updated: May 28, 2020, 11:21 AM IST
తిరుమల వేంకటేశ్వరుని ఆస్తుల వివరాలు టీటీడీ వెబ్‌సైట్‌లో..?
కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.
  • Share this:
టీటీడీ ఆస్తుల వేలం వేయాలన్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్తులను వెబ్‌సైట్‌లో ఉంచాలని పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి ప్రతిపాదించారు. దీనిపై సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా, అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాట్లను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భక్తులను అనుమతించే సమయంలో క్యూలైన్ లో భౌతిక దౌరం, శానిటేషన్ విధానంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 28, 2020, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading