ప్రపంచంలో గొప్ప ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam). హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala). రోజుకు లక్షల సంఖ్యలో భక్తులకు వసతి... దర్శన సదుపాయాలను ధార్మిక సంస్థ టీటీడీ (TTD) ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటుంది.
ప్రపంచంలో గొప్ప ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam). హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala). రోజుకు లక్షల సంఖ్యలో భక్తులకు వసతి... దర్శన సదుపాయాలను ధార్మిక సంస్థ టీటీడీ (TTD) ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉంటుంది. రాజకీయ... స్వార్ధ ప్రయోజనాలకోసం టీటీడీని నిత్యం వార్తల్లో ఉంచుతూ.... శ్రీవారి భక్తుల మనోభావాలు బిడ్డ తీసే విధంగా సోషల్ మీడియాలో కుట్ర పూరిత వార్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిటిడిపై అసత్య ప్రచారం తీవ్ర దుమారం రేపుతుంది. కొందరు నెటిజన్లు కావాలనే టిటిడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర నుండి వైసీపి నాయకుల నోట్లో పలుకుతున్న మాట.. కలియుగ వైకుంఠ నాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంను టార్గెట్ గా చేసుకుని సిటిజన్లు చేస్తున్న ప్రచారానికి పూర్తి స్ధాయిలో చెక్ పెట్టే విధంగా టిటిడి ఉన్నతాధికారుల ఆదేశాలతో టిటిడి విజిలెన్స్, పోలీసు సమన్వయంతో అసత్య ప్రచారంకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.. అయితే కొందరు ప్రతిపక్ష నేతలు కావాలనే టిటిడిపై అసత్య ప్రచారం చేయిస్తున్నారనే వాదలు కూడా అధికంగానే వినిపిస్తున్నాయి.
తిరుమల అంటేనే కోట్లాది హిందువుల మనోభావాలకు ముడిపడిన అంశం. ఒక్క వార్త ప్రచారం చేయాలంటే కచ్చితంగా అందుకు తగ్గ అధరాలు తప్పనిసరిగా ఉండాలి. రెండు వారాలుగా సోషల్ మీడియాలో ఓ వార్త మాత్రం.... విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 300 వందల లడ్లు తిరుపతి నుంచి ఢిల్లీ వరకు తరలించారనే ఆరోపణలు. అది ఓ ఉన్నతాధికారి స్వార్ధం కొరకు అంటూ ఫేస్బుక్., ట్విట్టర్., వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ వచ్చారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు విమర్శలు చేస్తున్నారని అధికారుల ఆరోపణ.
అసలు విషయానికి వస్తే పది రోజుల క్రితం టిటిడిలోని ఓ ఉన్నతాధికారి సుమారు మూడు వందల కళ్యాణోత్సవం లడ్డూలను ఢిల్లీకి విమానంలో తరలించారట. దీనిపై కొంత వరకూ భక్తుల్లో సందేహాలు కూడా నెలకొన్నాయి. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఎక్స్టెన్షన్ కోసం ఢిల్లీలో లాబింగ్ చేందుకు మూడు వందల లడ్డూలను తీసుకెళ్ళినట్లు, అయితే మూడు వందల కళ్యాణోత్సవం లడ్డూలను తీసుకెళ్ళేందుకు ఎయిర్ క్రాప్ట్ సిబ్బంది ఒప్పుకోక పోవడంతో, పెద్దల ద్వారా మాట్లాడి మరోక ఎయిర్ క్రాప్ట్ లో తీసుకెళ్ళారని జరుగుతున్న ప్రచారంపై భక్తుల్లో అనేక సందేహాలు నెలకొంది. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు టిటిడి అధికారులకు ఈ ట్రోల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ విషయంపై దర్యాప్తు సాగించిన తిరుమల టూటౌన్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. ఈ సందర్భంగా తిరుమల అడిషనల్ ఎస్పి మునిరామయ్య మీడియాకు వివరణ ఇచ్చారు.. టిటిడిపై సోషయల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు.. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన క్రమంలో ఢిల్లీలో కొందరు పెద్దలను కలిసే అవకాశం ఉందని, ఆ సమయంలో మర్యాదపూర్వకంగా వారికి ప్రసాదాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఢిల్లోలోని ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ అభ్యర్ధన మేరకు కేవలం ముప్పై కళ్యాణోత్సవం లడ్డూలను మాత్రమే ఏపి భవన్ కమీషనర్ కి అందజేయడం జరిగిందని వివరించారు. ఆ లడ్డూ సంబంధించిన నగదును కూడా ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ టిటిడి ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు.
అంతేకానీ ఇతరత్రా స్వలాభం కోసం కళ్యాణోత్సవం లడ్డూలను ఢిల్లీకి పంపలేదన్నారు.. కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం టిటిడి ఉన్నతాధికారులపై అబాండాలు వేయడం సరికాదన్నారు.. నిన్న టిటిడి లడ్డూ పోటూ ఏఈవో ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసాంమని, దుష్ప్రచారం చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాంమని, కోట్లాది మంది హిందూవులు మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఎవరూ పాల్పడవద్దని అడిషనల్ ఎస్పి ముని రామయ్య తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.