వైకుంఠ ద్వార దర్శనంపై తేల్చి చెప్పిన టీటీడీ

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు (ఏకాదశి, ద్వాదశి) మాత్రమే కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: January 5, 2020, 5:40 PM IST
వైకుంఠ ద్వార దర్శనంపై తేల్చి చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయం
  • Share this:
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు (ఏకాదశి, ద్వాదశి) మాత్రమే కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కల్పించాలంటూ హైకోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోవాలని, అందుకు కోర్టు కూడా అంగీకరిస్తుందంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించింది. వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే కల్పించాలని నిర్ణయించించింది.

ఈనెల 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల కోసం తిరుమలలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు కొండకు చేరుకున్నారు. క్యూ లైన్ల వెలుపల కూడా భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమహా విష్ణువు మేల్కొంటారని, ఆ రోజు ముక్కోటి దేవతలు వచ్చి ఆయన్ను దర్శించుకుంటారని హిందువుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి నుంచే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.

First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు