Home /News /andhra-pradesh /

TTD BOARD APPROVE NEW BUDGET AND TOOK KEY DECISIONS ON DARSHAN TOKENS FULL DETAILS HERE PRN TPT

TTD: శ్రీవారి భక్తులకు త్వరలో గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. బడ్జెట్ కు ఆమోదం..

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) పాలకమండలి సమావేశం ముగిసింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ (TTD) వార్షిక బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) పాలకమండలి సమావేశం ముగిసింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ (TTD) వార్షిక బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096 కోట్లతో బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించింది. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. భక్తుల అనుమతి ఎప్పుడనేది ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది. శ్రీవారి దర్శనకు వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబ్బందనలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే చిన్నపిల్ల ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని.. 100 మంది లో 99 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.230 కోట్లతో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.

  తితిదే ఉద్యోగులకు నగదు రహిత వైద్యు సేవలు అందించేందుకు రూ. 25 కోట్ల మంజూరు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.రూ.2.73కోట్లతో స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరణ పనులు చేపడతామని.. తిరుమలలో అన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదం అందిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో హోటళ్లు లేకుండా భక్తులకు భోజనం అందించేలా చర్యలు చేపడుతామ్న్నారు. అన్నప్రసాదం భవనంలో భోజనం తయారు చేసేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.

  ఇది చదవండి: పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. థియేటర్లలో రచ్చ రచ్చే..


  తిరుపతిలోని సైన్స్ సెంటర్ కు ఇచ్చిన 70 ఎకరాలల్లో 50 ఎకరాల వెనక్కి తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తీసుకు వస్తామని.. కరోనాకు ముందు ఏవిధంగా దర్శనాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటిస్తామని.. అన్నమయ్య మార్గంను వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అటవీ శాఖ అనుమతులు వచ్చేలోపు తాత్కాలిక పనులు చేపడతామని.., ప్రస్తుతం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా నడక దారిని ఏర్పాటు చేస్తామని వివరించారు.

  ఇది చదవండి: ఏపీలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు టెన్షన్.. ఇళ్ల నిర్మాణంపై సర్కార్ నోటీసులు.. కారణం ఇదే..!


  శ్రీవారి ఆలయంలోని మహద్వారం, ఆనందనిలయం, బంగారువాకిలిలో బంగారు తాపడం చేయాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే మహద్వారంకు తాపడం పనులు మొదలు పెడతామమన్నారు. ఆనంద నిలయంకు బంగారు తాపడం పనులు చేసేందుకు ఆగమ సలహాలు మేరకు పూర్తిచేస్తామన్నారు. శ్రీనివాస సేతుకు నిర్మాణంకు ఇప్పటి వరకు తితిదే రూ.100 కోట్లు ఇచ్చిందని.., మరో రూ.150 కోట్లను ఈ ఏడాది డిసెంబర్ లోపు మంజూరు చేస్తామమన్నారు.బాలాజీ జిల్లా కు కలెక్టరేట్ గా పద్మావతి నిలయాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

  ఇది చదవండి: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..


  2022-23 రూ.3,096 బడ్జెట్ ఆమోదించిన టీటీడీ.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా వేయి కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అలాగే డిపాజిట్లపై 668 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఇక ఆర్జిత సేవ టికెట్ల ధరలపై పాలకమమండలి చర్చించింది. ఆర్జిత సేవల ధరలు పెంపు నిర్ణయం తీసుకోలేదని., సిఫార్సు లేఖలపై ఇచ్చే సేవల ధరలు పెంచాలనే అంశం చర్చకు వచ్చిందని టీటీడీ తెలిపింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు విక్రయంపై రూ.242 కోట్లుప్రసాదం విక్రయంపై రూ.365 కోట్లు, అద్దెగదులు, కళ్యాణ మండపాల ద్వారా రూ.95 కోట్లు., తలనీలాల విక్రయం ద్వారా రూ.126 కోట్లు., ఆర్జిత సేవల ద్వారా రూ.120 కోట్లు వస్తుందని టీటీడీ వివరించింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు